: పార్టీ గెలిస్తే అఖిలేషే ముఖ్యమంత్రి!: ములాయం సింగ్

ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిస్తే అఖిలేష్ యాదవే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ అధినేత, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని మరోమారు స్పష్టం చేశారు. సమాజ్ వాదీ- కాంగ్రెస్ పార్టీ కూటమి తరపున, సోదరుడు శివ్ పాల్ తరపున మొదట తాను ప్రచారం చేస్తానని, ఆ తర్వాత అఖిలేష్ ప్రకటించిన అభ్యర్థుల తరపున ఓట్లు అడుగుతానని ములాయం సింగ్ చెప్పారు. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కొత్త పార్టీ పెడతానని ఇటీవల శివ్ పాల్ చేసిన ప్రకటన విషయమై ములాయంను ప్రశ్నించగా, శివ్ పాల్ విడిపోవడం లేదని, తనను తీసుకువెళ్లకుండా ఆయన కొత్త పార్టీ ఎలా పెట్టగలరు? అని అన్నారు.


 

More Telugu News