: శశికళపై ఛేంజ్.ఆర్గ్ లో నెటిజన్లు చేస్తున్న విపరీత కామెంట్లలో కొన్ని!


తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించేందుకు శశికళ సిద్ధమైన వేళ... ఆమెపై అభిప్రాయ సేకరణకు నడుం బిగించింది ఛేంజ్.ఆర్గ్ సంస్థ. ఈ సందర్భంగా వేలాది మంది శశికళకు వ్యతిరేకంగా తమ ఓటు వేస్తున్నారు. అంతేకాదు, ఆమెకు వ్యతిరేకంగా పలు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న కామెంట్లలో మచ్చుకు కొన్ని...

  • ఒక సర్వెంట్ తమిళనాడుకు ముఖ్యమంత్రి ఎలా అవుతుంది? ఇలాంటి మూర్ఖపు పనిని నేను అంగీకరించను. దయచేసి తమిళనాడును కాపాడండి.
  • ఒక సేవకురాలు నా రాష్ట్రానికి సేవ చేసేందుకు నేను అంగీకరించను. మరోసారి ఎన్నికలు నిర్వహించండి.శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి.
  • సీఎం అయ్యే ఏ ఒక్క అర్హత కూడా శశికళకు లేదు.
  • తమిళనాడు నాశనం అవుతోంది.
  • ప్రధాని మోదీ ఈ విషయంలో వెంటనే కల్పించుకోవాలి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.
  • ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను శశికళకు ఓటు వేయలేదు. ప్రజల మనసులో ఏం ఉందో తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... శశికళ మాఫియాకు తొత్తులుగా మారారు.
  • హౌస్ కీపింగ్ చేసిన ఓ మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకోవడానికి శశికళ రెడీగా ఉంది. ఆమెను ఇక్కడితోనే ఆపేయాలి.
  • రాష్ట్రంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మేధావులే పాలించాలి.
  • శశికళను ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
  • ఆమె ముఖ్యమంత్రి అయితే మన్నార్ గుడి మాఫియా పాలన వస్తుంది. ఆమెను ఇక్కడితో ఆపేయండి.
పైవిధంగా, శశికళకు వ్యతిరేంగా నెటిజన్లు తమ గళం వినిపిస్తున్నారు. మరోవైపు, ఇలాంటివేవీ పట్టించుకోకుండా అన్నాడీఎంకే పార్టీ నేతలు శశిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News