: ప్రయాణికులను వదిలేసి ఎగిరిపోయిన విమానం.. శంషాబాద్లో ‘ఇండిగో’ నిర్వాకం
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఒకటి ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఎగిరిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్లైన్స్ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. శంషాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం 25 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే టేకాఫ్ అయింది. విమానం వెళ్లిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రయాణికులు ఎయిర్ లైన్స్ నిర్వాకంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. వారికి సర్దిచెప్పేందుకు ‘ఇండిగో’ అధికారులు ప్రయత్నిస్తున్నారు.