: నోరూరించే ‘సూర్య’ దోశ సంగతులు!
ప్రముఖ సినీ దంపతులు సూర్య, జ్యోతిక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తరచుగా దర్శనమిస్తుంటాయి. తాజాగా, నటుడు సూర్య దోశ తయారు చేస్తూ దిగిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. స్టౌ ముందు నిల్చుని దోశ వేస్తున్న పోజుతోను, దోశ తయారు అయిన తర్వాత దాన్ని ప్లేట్ లో పట్టుకుని తన భార్య జ్యోతికతో కలిసి మరొక పోజుతో ఈ ఫోటోలు వున్నాయి. ప్రేమతో దోశ వేశానని చెప్పిన సూర్య, నటుడు మాధవన్, నిర్మాత వెంకట్ ప్రభు, సంగీత దర్శకుడు హరీష్ శంకర్, దేవీశ్రీ ప్రసాద్ లను ఛాలెంజ్ చేస్తున్నట్లు ఆ ట్వీట్ లో ఈ ‘సింగం’ పేర్కొన్నాడు. అయితే, సూర్య ఛాలెంజ్ ను ఒప్పుకున్నట్లుగా మాధవన్, వెంకట్ ప్రభు తమ ట్వీట్ల ద్వారా బదులు ఇచ్చారు.