: బాబాయి! ‘కాటమరాయుడు’ టీజర్ సూపర్బ్: నటుడు రామ్ చరణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’టీజర్ ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ విడుదల చేసిన ఇరవై గంటల్లోనే 2.8 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ‘కాటమరాయుడు’టీజర్ పై ప్రశంసల వర్షం కురుస్తున్న తరుణంలో, పవన్ కు కొడుకు వరుస అయ్యే నటుడు రామ్ చరణ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘కాటమరాయుడు’ టీజర్ ‘సూపర్బ్’ అని తన ట్వీట్ లో ప్రశంసించాడు.