: ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్టు!


టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ పీఏ శేఖర్ పై నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో పీఏ శేఖర్ ను హౌస్ అరెస్టు చేశారు. హిందూ పురంలో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది. కాగా, బాలకృష్ణ పీఏ వ్యవహారం కేవలం హిందూపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం బాలకృష్ణ ఇమేజ్ పై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో శేఖర్ ను దూరంగా పెట్టనున్నట్టు తెలుస్తోంది. పీఏ శేఖర్ తీరుపై హిందూపురం టీడీపీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఏ పదవి నుంచి శేఖర్ ను తప్పించకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని బాలకృష్ణకు ఇప్పటికే వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News