: ఇది వింతే....పురుషుని శరీరంలో స్త్రీ జననాంగాలు!
ప్రభుత్వాసుపత్రి వైద్యులు సాధారణ హెర్నియా ఆపరేషన్ చేసి ఆశ్చర్యానికి లోనైన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...ఆత్మకూరుకు చెందిన వ్యక్తి హెర్నియా బాధతో 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరాడు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని నిర్ణయించారు. దీంతో ఆపరేషన్ కు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడంతో ఆపరేషన్ ప్రారంభించారు. హెర్నియాను తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అతని శరీరంలో స్త్రీ జననాంగం, గర్భసంచి దర్శనమిచ్చాయి. దీంతో వారు ఆశ్చర్యపోయారు. అనంతరం శస్త్ర చికిత్సతో వాటిని తొలగించారు. ఇది చాలా అరుదైన విషయమని, వాటిని తొలగించకపోయి ఉంటే అతనికి క్యాన్సర్ సోకే అవకాశముండేదని వారు చెప్పారు.