: పంజాబ్, గోవా, యూపీ రాష్ట్రాల ఫలితాలపై జోస్యం చెప్పిన లాలూ
పంజాబ్, గోవా రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్, గోవా ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో సైతం బీజేపీ ఆశలు ఆవిరవుతాయని చెప్పారు. ఈ ఓటమికి కారణం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలే అని తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. అమిత్ షా కూడా ఒక రాజకీయ నాయకుడేనా? అని ప్రశ్నించారు. ఆయన డబ్బు మనిషని... డబ్బుకు సంబంధించిన కార్యకలాపాలు తప్ప, అమిత్ షాకు ఇంకేం చేతకాదని ఎద్దేవా చేశారు.