: గోవా ఆహారం మిస్సవుతున్నా.. బరువుతగ్గిపోయా: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పారికర్
గోవాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఆ రాష్ట్రానికి చెందిన నేత, కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఈ రోజు ఉదయం 7.10 కే అందరికన్నా ముందుగా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు, 'ఎందుకు సన్నబడిపోయారని' ఓ విలేకరి అడగగా, 'ఢిల్లీలో వుండడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను, నాకు గోవా ఆహారం అంటే ఎంతో ఇష్టం' అని సమాధానం చెప్పిన ఆయన... ‘ఇప్పుడు మీ ఇష్టం.. దీనిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రాసుకోండి’ అంటూ నవ్వేశారు .
ఆ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రిగా పారికర్ మళ్లీ బాధ్యతలు చేపడతారని చర్చ జరుగుతున్న వేళ మనోహర్ పారికర్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తనకు బటర్ చికెన్ కన్నా గోవా చేపల కూర ఇష్టమని అన్నారు. తాను పార్టీ మనిషినని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని పారికర్ చెప్పారు.