: 30 మంది చిన్నారుల‌ను కొట్టిన ఉపాధ్యాయిని.. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన‌ 10 మంది


మార్కులు తక్కువ తెచ్చుకున్నారంటూ విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చిత‌క‌బాద‌డంతో 10 మంది విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఘ‌ట‌న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండలం మున్ననూరులోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇంగ్లిష్ టీచర్ కల్యాణి కొడుతున్న దెబ్బ‌ల‌కు తాళ‌లేక త‌మ‌ని కొట్ట‌వ‌ద్ద‌ని పిల్ల‌లు వేడుకున్న‌ప్ప‌టికీ వారి మాట వినిపించుకోకుండా 30 మంది విద్యార్థులను ఆమె తీవ్రంగా కొట్టింది. బాధిత విద్యార్థుల్లో ఒకరికి ఫిట్స్ కూడా వచ్చాయి. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయిన విద్యార్థులంతా ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల‌ను హింసించిన టీచ‌ర్‌ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News