: రామోజీరావును పరామర్శించిన చంద్రబాబు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. బేగంపేటలో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రామోజీని చంద్రబాబు కలిశారు. ఈరోజు చంద్రబాబు హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. తొలుత నందమూరి రామకృష్ణ ఇంటిలో జరిగిన శుభకార్యంలో పాల్గొన్న చంద్రబాబు... ఆ తర్వాత రామోజీ నివాసానికి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురైన రామోజీరావు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూడు రోజుల క్రితమే రామోజీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.

More Telugu News