: నిశ్చితార్థం చీర బాగుందన్న రకుల్ తో సమంతా ఏమందంటే..!


నిశ్చితార్థం సందర్భంగా సమంత ధరించిన చీర తనకు చాలా బాగా నచ్చిందని అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ చెబుతోంది. సామాజిక మాధ్యమం వేదికగా  సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లు మాట్లాడుకున్న సందర్భంలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించింది.
ఇందుకు స్పందించిన సమంత, ‘నీ కోసం కూడా ఇలాంటిదే తయారు చేయిద్దాం’ అని నవ్వుతూ ట్వీట్ చేసింది. కాగా, అక్కినేని నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

అయితే, ఈ వేడుకలో సమంత ధరించిన చీరపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే, ‘ఏం మాయ చేశావే’ చిత్రంలోని నాగ చైతన్య, సమంతలకు సంబంధించిన ఓ సన్నివేశం నుంచి ఇటీవల జరిగిన అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు ఉన్న దృశ్యాలను సమంత చీర అంచుల్లో డిజైన్ చేయించారు. బైక్ పై సమంత, చైతన్య కలిసి ఉన్న ఓ చిత్రం కూడా ఈ చీరపై డిజైన్ రూపంలో కనపడుతుంది. 

  • Loading...

More Telugu News