: పేపర్లో వచ్చిన ఫోటోలపై స్పందించను... సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం: నాయిని
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధం ఉన్న ఏ అధికారినీ వదిలిపెట్టమని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తోందని అన్నారు. నయిీం ఘటనలపై సిట్ లోతైన దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. పేపర్లో వచ్చిన ఫోటోలపై తాను స్పందించనని స్పష్టం చేశారు. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కోదండరాం తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో కలిసి ఆయన విమర్శలు చేస్తున్నాడని ఆయన చెప్పారు. తెలంగాణకు కోటి ఎకరాలకు నీరందించే ప్రయత్నం తాము చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు.