: లోక్ సభవాయిదా...రాజ్యసభలో గందరగోళం
లోక్ సభ వాయిదా పడింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార పక్షంపై విపక్ష సభ్యులు తీవ్ర విమర్శలు చేయడంతో లోక్ సభలో తీవ్రగందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది. తమ ఎంపీలను సస్పెండ్ చేయడంపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సమయంలో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. స్పీకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ టీఎంసీ ఎంపీ డెరిక్ పట్టించుకోకుండా సభ నుంచి నిష్క్రమించారు. దీంతో ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి.