: దాసరి మాట్లాడుతున్నారు, ఇక భయం లేదు: మురళీమోహన్
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, శ్వాస సమస్యలతో కిమ్స్ లో చేరి చికిత్సను పొందుతున్న దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఉదయం ఆయన్ను పరామర్శించిన నటుడు మురళీమోహన్ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. దాసరి మాట్లాడుతున్నారని, ఆయనకు ఎలాంటి ప్రాణ భయమూ లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ తగ్గిందని, స్వయంగా ఊపిరి పీల్చుకుంటున్నారని, త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు దాసరిని షిఫ్ట్ చేయనున్నట్టు వెల్లడించారు.