: ఎనభై రెండేళ్ల వయసులో ‘పద్మశ్రీ’ అందుకోవడం నాకు ఇష్టం లేదు: సితార్ వాయిద్యకారుడు ఉస్తద్

తనకు ‘పద్మశ్రీ’ వద్దని, ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను ఈ అవార్డుతో పోల్చుకోలేనని ప్రముఖ సితార వాయిద్యకారుడు ఉస్తద్ ఇమ్రత్ ఖాన్ వ్యాఖ్యానించారు. చికాగాలో భారత రాయబారి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎనభై రెండేళ్ల వయసులో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకోవడం తనకు ఇష్టం లేదని, అంతేకాకుండా, తనకంటే ముందే జూనియర్లు ఈ పురస్కారం అందుకున్నారని అన్నారు. అయితే, తనకు ఈ పురస్కారం ప్రకటించడం వెనుక మంచి ఉద్దేశమే ఉన్నా, తనకు మాత్రం ఎన్నో సందేహాలు ఉన్నాయని, ఈ పురస్కారం తనను ఆలస్యంగా వరించిందని చెప్పిన ఉస్తద్ ఇమ్రత్, ఈ వ‌ృత్తిని ఉన్నత స్థానంలో ఉంచానని అన్నారు. కాగా, గత నెలలో కేంద్రం ఈయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది.

More Telugu News