: అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం!


అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు తమ దేశం వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులు వలస వస్తారనే కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఏడు ముస్లిం దేశాలపై అమెరికా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. అయితే, సిరియా దేశంపై అమెరికా కంటే ముందుగానే కువైట్ నిషేధం విధించింది. 2011లోనే సిరియా దేశస్తులకు వీసాలు మంజూరు చేయడాన్ని కువైట్ నిలిపివేసిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News