: నాసిరకం భోజనం పెడుతున్నారన్న జవాన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు.. తిరస్కరించిన అధికారులు!

నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ వాలంటరీ రిటరైమెంట్
సర్వీస్ (వీఆర్ఎస్) కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆయన దరఖాస్తును బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తిరస్కరించారు. సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న తేజ్ బహదూర్ చేసిన ఆరోపణలపై విచారణ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అంశం పెండింగ్ లో ఉన్నందున వీఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరించామని, ఈ విషయాన్ని గత నెల 30న బహదూర్ కు తెలియజేశామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తేజ్ బహదూర్ ను బీఎస్ఎఫ్ అధికారులు బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని, అరెస్టు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కొట్టిపారేశారు. 

More Telugu News