: పెరగనున్న సెల్ ఫోన్ ధరలు?


కొత్తగా మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ మీకు కాస్త షాకిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు పెడుతున్న ధరకంటే 1 లేదా 2 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2017-18 లో భారత్‌ లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లపై స్పెషల్‌ అడిషనల్‌ డ్యూటీ (ఎస్‌ఏడీ) ని అదనంగా విధించనున్నారు. మొబైల్ లో ప్రధానమైన పాపులేటెడ్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌(పీసీబీ) పై దీనిని విధించనున్నారు. దీనిని వాడుక భాషలో సర్క్యూట్ బోర్డుగా పిలుస్తారు. ఇది లేనిదే మొబైల్ తయారీ అసాధ్యం. దీనికి విధించే పన్నుతో మొబైల్ ధరలు పెరగనున్నాయి. 

  • Loading...

More Telugu News