: త్రివిక్రమ్ తో కలిసి వెళ్లి, దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారన్న వార్త బాధ కలిగించిందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత శరత్ మరార్ తో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన పవన్ కల్యాణ్ దాసరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని కిమ్స్ వైద్యులు చెబుతున్నారని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 'మా' అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా ఆయనను పరామర్శించారు. అయితే ఇన్ఫెక్షన్ సోకకూడదని సందర్శనకు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని వారు వెల్లడించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు.