: పోస్టు ప్రొడక్షన్ పనులకు ముందే 500 కోట్ల బిజినెస్ చేసిన 'బాహుబలి-2'
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘బాహుబలి 2’ పోస్టు ప్రొడక్షన్ సమయానికే 500 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిందని ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాల ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 500 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని ఆయన ప్రకటించారు. డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ ద్వారా 'బాహుబలి-2' 500 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు.
కాగా, తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి 2’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. 180 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ‘బాహుబలి-ద బిగినింగ్’ కి కొనసాగింపుగా వస్తోంది. ఈ సినిమాలో తొలి భాగంలో నటించిన ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితరులు నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా తొలి భాగం 600 కోట్ల వసూళ్లు సాధించి భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.