: కేంద్ర బడ్జెట్.. అమరావతికి భూములిచ్చిన రైతులకు వరమిచ్చిన కేంద్రం


ఏపీ రాజధాని అమరావతికి వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వరమిచ్చింది. వీరందరికీ మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపును ఇచ్చింది. ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు అమరావతి రైతులకు వరాన్ని ప్రకటించారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మినహాయింపును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం గతంలో జైట్లీని కోరింది. అందుకు ఆయన ఒప్పుకున్నారు. చెప్పిన విధంగానే అదే విషయాన్ని ఆయన కేంద్ర బడ్జెట్ లో పొందుపరిచారు. దీంతో, ఏపీ ప్రభుత్వ కృషి ఫలించినట్టైంది. 

  • Loading...

More Telugu News