: మమతా బెనర్జీలో ఊహించని మార్పు.. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయద్దని ఎంపీలకు సూచన!

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. మోదీపై అయితే ఏకంగా యుద్ధమే ప్రకటించారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసి, మోదీని ఇరుకున పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా ఆమె కాస్త శాంతించారు. తన స్వరాన్ని కొంచెం తగ్గించారు.

కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయవద్దని తన పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ తన ఎంపీలకు సూచించిన ఆమె... నిరసన తెలిపే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. మోదీపై వ్యక్తిగత దాడులు చేయడం, నిందలు మోపడం చేయకూడదని సూచించారు. ప్రధానిని తాను పిలిచినట్టు 'మోదీ బాబు' అని ఎవరూ సంబోధించకూడదని చెప్పారు. భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More Telugu News