: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు!


విశాఖ, సికింద్రాబాద్ మధ్య వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.  విశాఖ నుంచి ఫిబ్రవరి 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి మంగళవారం, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 1 వరకు ప్రతి బుధవారం ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని తెలిపారు. 22 కోచ్ లతో నడిచే ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.

అంతేకాకుండా, విశాఖపట్నం- తిరుపతి మధ్య కూడా మరో ఎనిమిది ప్రత్యేక వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ,న్యూ గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఫిబ్రవరి 6 నుంచి 27వ తేదీ వరకు ప్రతి సోమవారం నడవనున్నాయి. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి విశాఖపట్టణానికి ఫిబ్రవరి 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి మంగళవారం ఈ రైళ్లు ఉంటాయి.

విశాఖపట్టణం నుంచి విల్లుపురానికి మరో 78 ప్రత్యేక సువిధ, ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, చెంగల్పట్లు స్టేషన్ల మీదుగా నడవనున్న ఈ రైళ్లు  ఏప్రిల్ 1 నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శని వారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 2 నుంచి జూన్ 29 వరకు వారంలో మూడు రోజులు ఈ రైళ్లు నడవనున్నాయి.

  • Loading...

More Telugu News