: మనీ లాండరింగ్ కేసులో మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు!

మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి హరినారాయణ రాయ్ కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధించారు. ఈ మేరకు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. మాజీ సీఎం మధు కోడా కేబినెట్ లో అటవీ, పర్యాటక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.3.72 కోట్లను ఆయన అక్రమంగా బదిలీ చేసినట్లు నిరూపితమైనట్లు కోర్టు పేర్కొంది. కాగా, ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కూడా ఉన్నారు. 2009 సెప్టెంబరులో వందల కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అంతేకాకుండా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పన్నెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద మొదటిసారి జైలు శిక్ష విధించిన కేసు ఇదే కావడం గమనార్హం.

More Telugu News