: తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత.. ఆమెకు చీర బహూకరించిన కేటీఆర్


తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి సమంతను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ భవన్ లో కేటిఆర్ ను ఈరోజు సమంత కలిశారు. చేనేతకు చేయూతను అందించేందుకు, ఈ ఉత్పత్తుల ప్రచారానికి తాను సిద్ధమని కేటీఆర్ తో చెప్పిన ఆమె, ఈ విషయమై కొన్ని సూచనలు, సలహాలు కూడా చేసింది. చేనేతను బతికించడంలో కేటీఆర్ స్ఫూర్తిని సమంత అభినందించింది.

కాగా, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (టీఎస్ సీఓ) అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించిన సమంతకు కేటీఆర్ తన  కృతఙ్ఞతలు తెలియజేశారు. హ్యాండ్లూమ్స్  కు మరింత ఆదరణ వచ్చేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా పోచంపల్లి చీరను సమంతకు బహూకరించారు. కాగా, సమంతకు చీర బహూకరిస్తున్న ఫొటోను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. అక్కినేని నాగ చైతన్యతో సమంత ఎంగేజ్ మెంట్ జరిగిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  

  • Loading...

More Telugu News