dasari health: దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారు: మోహన్ బాబు

ద‌ర్శ‌కుడు, కేంద్ర‌ మాజీ మంత్రి దాసరి నారాయణరావుకి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంది. ఆయ‌న‌కు శ‌స్త్ర‌చికిత్స చేసిన అనంత‌రం డాక్ట‌ర్లు బులిటెన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినీన‌టుడు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ... దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని అన్నారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన మనిషని పేర్కొన్నారు. దాస‌రికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ‌ గురువు దాసరి నారాయ‌ణరావు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, అందరూ ఆయ‌న‌ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయ‌న అన్నారు.
dasari health
mohan babu

More Telugu News