: చెయ్యి విరిగినట్లు బ్యాండేజ్ కట్టుకొని ఫొటో పోస్ట్ చేసిన హీరోయిన్ కత్రినా కైఫ్


బాలీవుడ్‌తో పాటు కొన్ని టాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించిన న‌టి కత్రినా కైఫ్ తాజాగా త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అయితే, ఆ ఫొటోను చూసిన ఆమె అభిమానులు షాక్ తిన్నారు. ఆ ఫొటోలో ఆమె ఒక పాత కారు ముందు కూర్చుని, తన ఎడమ చేతికి కట్టు కట్టుకుని క‌న‌ప‌డుతోంది. దీంతో ఆమె చెయ్యికి ఏమైంద‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఆమె చెయ్యి విరిగిన కార‌ణంగానే ఇలా బ్యాండేజి వేయించుకుందా? అనుకున్నారు. అయితే, ఈ ఫొటోలో ఉన్నది నిజమైన బ్యాండేజి కాదు. ఆమె ప్ర‌స్తుతం 'జగ్గా జాసూస్' సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా వ‌చ్చే ఏప్రిల్‌లో విడుద‌ల అవుతుంది. అందులో భాగంగానే ఆమె ఈ నకిలీ కట్టు కట్టుకుందని తెలిసింది. ఈ ఫొటో పోస్ట్ చేస్తూ ఆమె... సూర్యాస్తమయం సమయం వచ్చినప్పుడు ఎంత ప్ర‌ధాన‌మైన‌ పని ఉన్నా సరే వదిలిపెట్టాలని, ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News