: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మృతి


కర్ణాటకలోని చింతామణి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు. బత్తిన సత్యరాజ్ (25), బత్తిన అమల్ రాజ్ (22)లు మోటార్ బైక్ పై వెళుతుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.  వీరిద్దరిదీ చిత్తూరు జిల్లా కలకడ మండలం దేవులపల్లి గ్రామం. కొన్నేళ్లుగా వీరు కడప జిల్లా రాయచోటిలోని గాలివీడు రోడ్డులో ఉంటున్నారు. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. చింతామణిలో బైక్ కొనుగోలు చేసి, తిరిగి బెంగళూరు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 

  • Loading...

More Telugu News