: యూపీ బీజేపీదే... తాజా పోల్ సర్వే
ఉత్తరప్రదేశ్ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనుందని తాజా పోల్ సర్వే అంచనా వేసింది. మొత్తం 403 స్థానాలున్న యూపీలో బీజేపీ 202 సీట్లలో విజయం సాధించనుందని టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే పేర్కొంది. బీజేపీకి 34 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. 31 శాతం ఓట్లతో కాంగ్రెస్ - సమాజ్ వాదీ కూటమికి 147 సీట్లు వస్తాయని వెల్లడించింది. 24 శాతం ఓట్లతో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 47 సీట్లు వస్తాయని, అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ 11 శాతం ఓట్లతో 7 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. కాగా, ముఖ్యమంత్రిగా అఖిలేష్ అద్భుతంగా పని చేశారని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది పేర్కొన్నారని టైమ్స్ నౌ ప్రకటించింది. ఆయన తరువాత మరెవరికీ అంత ప్రజాభిమానం దక్కలేదని తెలిపింది.