: మరుగుదొడ్లు వాడండి.. నెలకు రూ. 2,500 తీసుకోండి!


బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జనను నిర్మూలించేందుకు ఓ జిల్లా కలెక్టర్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా మరుగుదొడ్డిని ఉపయోగించే ప్రతి కుటుంబానికి రూ. 2,500 ప్రతి నెలా ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కలెక్టర్ సుధీర్ శర్మ ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అయితే, ప్రయోగాత్మకంగా ఆ పథకాన్ని రెండు పంచాయతీల్లో మాత్రమే ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని చేపట్టామని సుధీర్ శర్మ తెలిపారు. తమ ఆలోచన నెరవేరితే, ఈ పథకాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News