: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అస్వస్థత.. వైద్యుల సూచనతో విశ్రాంతి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అస్వస్థతతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం జిల్లా అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం తీవ్రజ్వరం, గొంతునొప్పితో నీరసంగా కనిపించారు. దీంతో సాయంత్రం సమీక్షకు హాజరుకాలేకపోయారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో సాయంత్రం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యారు.