: ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్ నియామకం
ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్ గా అమూల్య పట్నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీ కమిషనర్ గా ఉన్న అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టడంతో, ఆ స్థానంలో అమూల్య పట్నాయక్ ను నియమించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పట్నాయక్ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం, కేంద్ర పాలిత ప్రాంతం (ఏజీఎంయూటీ) క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.