: పరువునష్టం కేసులో భివాండీ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాసేపటి క్రితం మహారాష్ట్ర థానేలోని భివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ పై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. 2014లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే క్రిమినల్, పరువునష్టం కేసులు దాఖలు చేశారు.  

  • Loading...

More Telugu News