: 'కాపు గర్జన' ద్వారా ఏం సాధించామో ముద్రగడకే తెలియాలి.. మాకు మాత్రం అన్యాయం జరుగుతోంది!: ముద్రగడపై బలిజ నేతల అసంతృప్తి!


గత 30 ఏళ్లుగా బలిజ కులస్తులకు అన్యాయం జరిగిందని ఆ కులానికి చెందిన నేతలు ఒ.వి.రమణ, కోలా ఆనంద్, శ్రీనివాస్ లు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా కూడా తమకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. ఏ ప్రభుత్వం కూడా బలిజలను పట్టించుకోలేదని విమర్శించారు. కాపుగాటికి బలిజలను కట్టేయడంతో, తమకు మరింత అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

తునిలో నిర్మహించిన 'కాపు గర్జన' ద్వారా ఏం సాధించామో ముద్రగడకే తెలియాలని బలిజ నేతలు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీసేందుకు తమతో కలసి మద్రగడ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బలిజల ప్రాధాన్యతను ముద్రగడ గుర్తించడం లేదని విమర్శించారు. ఎంతసేపూ తమ సొంత కాపు కులస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News