: నేడు రెండో విడత రెడ్ మీ నోట్ 4 ఫ్లాష్ సేల్... రిజిస్ట్రేషన్స్ అవసరం లేదన్న క్సియోమీ


సరిగ్గా వారం క్రితం ఈ నెల 23న తొలిసారిగా ఫ్లిప్ కార్ట్ మాధ్యమంగా ఫ్లాష్ సేల్ కు వచ్చి నిమిషాల వ్యవధిలో లక్షల 'రెడ్ మీ నోట్ 4' స్మార్ట్ ఫోన్లను విక్రయించిన క్సియోమీ, నేడు మరో విడత ఫ్లాష్ సేల్ ను ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని, ఎలాంటి రిజిస్ట్రేషన్లూ అక్కర్లేదని, స్టాక్స్ అయిపోయేంత వరకూ విక్రయాలు సాగుతాయని పేర్కొంది. థర్డ్ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని పేర్కొంది.
కాగా, ఈ స్మార్ట్ ఫోన్ లో మెటల్ డిజైన్, 2.5డీ కర్వ్ డ్ గ్లాస్, ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉన్న సంగతి తెలిసిందే. 2 జీబీ ర్యామ్ 32 జీబీ మెమొరీ ఉన్న ఫోన్ ధర రూ. 9,999 కాగా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ధర రూ. 10,999గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 12,999గా క్సియోమీ పేర్కొంది.

  • Loading...

More Telugu News