: చివరి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా....ఇంగ్లండ్ లక్ష్యం 145


నాగ్‌ పూర్‌ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆరంభంలో, చివర్లో వికెట్లను వరుసగా కోల్పోయి ఒత్తిడిలో పడింది. దీంతో భారీ స్కోరు సాధించాల్సిన మ్యాచ్ లో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. వన్డే సిరీస్, తొలి టీ20లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో రాణించాడు.

కోహ్లీ (21) రైనా (7), యువరాజ్ సింగ్ (4) విఫలమైనా రాహుల్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. రాహుల్ అవుట్ కావడంతో మనీష్ పాండే (30) ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి ఓవర్లో వరుసగా పాండే, హార్డిక్ పాండ్య (2), ధోనీ (5), అమిత్ మిశ్రా (0) నాటకీయంగా అవుట్ కావడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 144 పరుగులకే పరిమితమైంది. చివరి ఐదు ఓవర్లలో 30 పరుగులు చేసిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోవడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో అద్భుతంగా రాణించిన జోర్డన్, మిల్స్, మొయిన్ అలీ, రషీద్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. దీంతో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 145 పరుగులు. 

  • Loading...

More Telugu News