: రైనా, యువీ అవుట్... టీమిండియా 69/3


నాగ్‌ పూర్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ ను ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. టాస్‌ ఓడి బ్యాంటింగ్ ప్రారంభించిన భారత జట్టు దూకుడే మంత్రంగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దీంతో కేవలం 15 బంతుల్లో 21 పరుగులు చేసిన కోహ్లీ జోర్డన్ వేసిన బంతిని బౌండరీ లైన్ కు తరలించే క్రమంలో పెవిలియన్ చేరాడు. అనంతరం జాగ్రత్తగా ఆడాల్సిన రైనా భారీ షాట్ కు యత్నించి, రషీద్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద జోర్డన్ కు దొరికిపోయాడు.

అనంతరం కేఎల్ రాహుల్ (36) కు యువరాజ్ సింగ్ (4) జతకలిశాడు. బ్యాటింగ్ ప్రారంభించిన దగ్గర్నుంచి తడబడుతూ ఆడిన యువీ దారుణంగా విఫలమయ్యాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అనంతరం రాహుల్ కు మనీష్ పాండే జత కలిశాడు. దీంతో టీమిండియా 10.3 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 69  పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News