: వైజాగ్ లో జరిగింది గెట్ టుగెదర్... విశాఖను డెవెలప్ చేశానని డప్పు కొట్టుకుంటున్నారు: బొత్స
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ సమ్మిట్ పేరిట జరిగింది పెట్టుబడుల చర్చలు కాదని, గెట్ టుగెదర్ నిర్వహించారని ఆయన మండిపడ్డారు. ఏపీకి పదేళ్ల ప్రత్యేకహోదా ఇవ్వాలని, తాము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పిన బీజేపీ, టీడీపీలు మాట మారుస్తున్నాయని ఆయన అన్నారు. నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలే కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. విశాఖపట్టణాన్ని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు డప్పుకొట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి అంతా తెలుసని ఆయన తెలిపారు.