: మిస్బాను కెప్టెన్సీ వదులుకొమ్మంటున్న చీఫ్ కోచ్!


పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లు ఊహించని ప్రతిపాదన చేసి ఆ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ కలకలం రేపాడు. వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో దారుణమైన పరాజయాలు మూటగట్టుకుంది. దీంతో జట్టులో భారీ ప్రక్షాళన చేపట్టాలని భావించిన చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్.. టెస్ట్ టీమ్‌ కెప్టెన్ మిస్బావుల్ హక్ ను తప్పుకోవాలని సలహా ఇచ్చాడు.

మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ల ఫార్ములా సరికాదని భావించిన పాక్ జట్టు మేనేజ్ మెంట్ సూచన మేరకు, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్... మిస్బాను తప్పుకోవాలని డైరెక్టుగా చెప్పకున్నా... టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లకూ ఒకరే కెప్టెన్‌ గా ఉంటే బాగుంటుందని మీడియాతో చెప్పాడు. దీంతో నేరుగా చెప్పకున్నా మిస్బాను టెస్ట్ కెప్టెన్సీ వదులుకొమ్మని చెప్పడమేనని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News