: దళితులపై ఇప్పుడు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది: కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వారికి ఖర్చు చేయాల్సిన రూ.17వేల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. దళితులపై కేసీఆర్‌కి ఉన్నట్టుండి ఇప్పుడు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ఆయన అన్నారు. వారి సంక్షేమానికి నిధులు ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. మరోవైపు దళితుడైన తెలంగాణ సీఎస్ ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని కేసీఆర్ ఎందుకు పొడిగించలేదని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఉపప్రణాళికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.