: రేపటి మ్యాచ్.. కోహ్లీకి కఠిన పరీక్ష!
టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కోహ్లీకి తొలిసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పట్టిందల్లా బంగారమే అన్నట్టు టెస్టుల్లో వరుస విజయాలు వరించాయి. ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో పూర్తి బాధ్యతలు చేపట్టిన కోహ్లీ సారధ్యంలో వన్డేల్లో అంతంత మాత్రంగానే జట్టు ఆడింది. అయితే సిరీస్ సాధనలో ధోనీ కూడా ఓ చేయి వేయడంతో తొలి వన్డే సిరీస్ ను కోహ్లీ గెలుచుకున్నాడు. వన్డే సిరీస్ గెలిచిన విశ్వాసంతో కీలక బౌలర్లు అశ్విన్, జడేజాలకు విశ్రాంతినిచ్చాడు. వారి స్థానంలో చాహల్, రసూల్ ను తీసుకొచ్చాడు. అయితే చాహల్ ఆకట్టుకున్నప్పటికీ రసూల్ పేలవ ప్రదర్శన జట్టుకు భారంగా మారింది.
దీంతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. రేపు నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ లో ఓటమిపాలైతే తొలి సిరీస్ లోనే ఓటమి నమోదు చేసుకున్న కెప్టెన్ల జాబితాలో కోహ్లీ కూడా చేరుతాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి రేపటి మ్యాచ్ కీలకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయదాహంతో పరితపించిపోయే కోహ్లీ..సహచరులపై మైదానంలో ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమవుతోంది. తొలి టీ20లో ధోనీపై కూడా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.