venkaiah naidu: నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిది: ప‌వ‌న్ కల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై వెంక‌య్య ఆగ్ర‌హం

ప్ర‌త్యేక హోదా పోరాటంలో భాగంగా రెండు రోజుల క్రితం విశాఖ‌ప‌ట్నంలోని ఆర్కే బీచ్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త త‌లపెట్టిన మౌన దీక్ష‌ను ప్ర‌భుత్వం అణచివేయ‌డంతో జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఉత్తరాది పెత్తనం అంటూ అనవసర వ్యాఖ్యలు చేశారని, నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిందని ఆయ‌న వ్యాఖ్యానించారు.
venkaiah naidu

More Telugu News