: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి దంపతులకు స్వైన్ ఫ్లూ!
ఏపీ, తెలంగాణల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి పంజా విసురుతోంది. కేవలం తెలంగాణలోనే ఇప్పటి వరకు 100 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆయన భార్య ఇద్దరూ స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, కర్నూలు నగరాల్లో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు.