supreme court: ‘గోవధ నిషేధం’పై వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదు: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గోవధను పూర్తిగా నిషేధించాలని, కబేళాలను ఎత్తేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ఈ రోజు విచారణకు వచ్చింది. వాదనల అనంతరం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని తేల్చి చెప్పింది. కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయని, మ‌రి కొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపింది. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై తాము జోక్యం చేసుకోలేమ‌ని పేర్కొంది. దేశమంతటా గోవధను నిషేధించేలా తాము ఆదేశాలు ఇవ్వలేమ‌ని స్ప‌ష్టం చేసింది.
supreme court

More Telugu News