special status: అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు : పవన్ కల్యాణ్ పై మండిపడ్డ మంత్రి కామినేని

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదా అంశంలో జనసేన అధినేత, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్ ఈ రోజు కేంద్ర స‌ర్కారుపై చేసిన విమ‌ర్శ‌ల ప‌ట్ల రాష్ట్ర‌ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్రత్యేక హోదా ఇస్తే ఎన్నో ప్రయోజనాలు కోల్పోతామ‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోన్న‌ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావ‌డానికి కేంద్ర స‌ర్కారు సాయం అవసరమని ఆయ‌న చెప్పారు. పవన్ క‌ల్యాణ్‌ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా 20వేల మంది యువత ఉపాధి పొందుతుంటే దానిపై కూడా పవన్ విమర్శలు చేశార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్య‌లు చేయడం భావ్యం కాద‌ని ఆయ‌న అన్నారు.
Go Back to Shorts
special status
pawan kalyan
kamineni

More Telugu News