: సెహ్వాగ్, రహానే, రైనాలకు సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ
ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గత భారత టీ20 కెప్టెన్లెవరూ నెలకొల్పని రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన అనంతరం తొలి టీ20 మ్యాచ్ ను ఇంగ్లండ్ జట్టుతో నేడు ఆడి 7 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో తొలి టీ20 మ్యాచ్ లో ఓడిన తొలి భారత కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. గతంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, అజింక్యా రహానేలకు సాధ్యం కాని ఈ రికార్డును కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం. ధోనీ తొలి టీ20 మ్యాచ్ లో ఫలితం తేలకపోవడం విశేషం.