special status: హ్యాట్సాఫ్.. జగన్ ను ఆకాశానికెత్తేసిన రాంగోపాల్ వర్మ!

విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న ప్ర‌త్యేక హోదా పోరాటంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వ‌రుస ట్వీట్లు చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించిన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఆయ‌న ఆకాశానికెత్తేశారు. జగన్ అసలైన నిబద్ధతను, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా నిరసన ప్రదర్శనలకు తనవంతు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన జ‌గ‌న్‌ కు 'హ్యాట్సాఫ్' అని అన్నారు.

ప్రత్యేక హోదాకు సహకరిస్తున్న వారిని పొగుడుతూ, సహకరించని వారిపై విమర్శలు గుప్పిస్తూ వర్మ హోదాపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు.

special status
varma

More Telugu News