special status: కింగ్ లేనిదే యుద్ధం ఎలా గెలుస్తాం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రేపు మాస్టర్ ప్లాన్ చెబుతారు!: రాంగోపాల్ వ‌ర్మ

ప్ర‌త్యేక హోదాపై ప్ర‌త్య‌క్షంగా పోరాడ‌కుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకా ట్వీట్లు మాత్ర‌మే ఎందుకు చేస్తున్నార‌ని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్ర‌శ్నించారు. రాజు లేనిదే యుద్ధం ఎలా గెలుస్తామ‌ని ఆయ‌న అన్నారు. అయితే, కాసేప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌తాన‌ని ట్వీట్ చేశాడు. దీంతో వ‌ర్మ మ‌రోసారి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ‘ఈ రోజు ప్ర‌త్యేక హోదా పోరాటం విఫలమైన నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపు హోదా పోరుని ఎలా సూప‌ర్ హిట్ చేయాలో మాస్ట‌ర్ ప్లాన్ చెబుతారు’ అని ట్వీట్ చేశారు.
 
 
special status
pawan kalyan
varma

More Telugu News