: వైజాగ్ ఆర్కే బీచ్ లో ర్యాలీ, అరెస్టులు
విశాఖపట్టణంలో నేటి సాయంత్రం నిరసన వ్యక్తం చేద్దాం రమ్మంటూ యువకులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ పార్టీలకు చెందిన నేతలను నేటి ఉదయం నుంచి పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. ఎవరినీ బీచ్ రోడ్ కు అనుమతించలేదు. బీచ్ రోడ్డులో 144 సెక్షన్ కూడా విధించారు. దీంతో ఎన్నడూ లేని విధంగా బీచ్ రోడ్ లో కర్ఫ్యూ విధించినట్టు నిర్మానుష్యంగా కనిపించింది. అయితే సాయంకాలం బీచ్ రోడ్ లోకి ఒక్కసారిగా ఇళ్లలోంచి దూసుకొచ్చిన నగరవాసులు, పోలీసు బారికేడ్లను ఛేదించారు. దీంతో బీచ్ రోడ్డులో పలువురు యువకులతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీని వైఎస్సార్సీపీ నేత వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను నోవాటెల్ హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.